జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరంలో శాంతి భద్రతను నెలకొల్పాలని కోరుతూ శ్రీ సత్య సాయి జిల్లా జిల్లా ఎస్పీ మాధవ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం చిలకం మధుసూదన్ రెడ్డి ఎస్పీ మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గానికి ఐపిఎస్ స్థాయి అధికారిని నియమించి శాంతి భద్రతలను నెలకొల్పాలని తెలిపారు. తదుపరి అడిషనల్ ఎస్పీ కేవీఆర్కే ప్రసాద్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, అబ్దుల్ అబూ, పుట్టపర్తి పట్టణ అధ్యక్షులు బొగ్గరం శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు.