Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

అనంతపురం నగరంలోని సమస్యాత్మక కాలనీలలో ఫ్లాగ్ మార్చ్

విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు శుక్రవారం అనంతపురం నగరంలోని పలు సమస్యాత్మక కాలనీలలో పోలీసులు వేర్వేరుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 1, 2, 3, 4 పోలీసు స్టేషన్ల సి.ఐ లు రెడ్డెప్ప, క్రాంతికుమార్, ధరణీ కిశోర్, ప్రతాప్ రెడ్డిల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కొనసాగించారు. ఒన్ టౌన్ పరిధిలోని బిందెలకాలనీ, వినాయకనగర్, భాగ్యనగర్, నారాయణరెడ్డి కాలనీ, ఆరవేటినగర్, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ … టూటౌన్ పరిధిలోని హమాలీ కాలనీ, హౌసింగ్ బోర్డు, జీసస్ నగర్ … త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్, రామచంద్రనగర్, ఎర్రనేల కొట్టాల… నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎ.నారాయణపురం, జనశక్తినగర్ లలో కేంద్ర సాయుధ బలగాలచే కవాతు నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించారు. అనంతరం… ఆయా కాలనీలలో సి.ఐ ల ఆధ్వర్యంలో పోలీసులు సమావేశమయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img