భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డా: బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకలు
విశాలాంధ్ర – ధర్మవరం : సామాజిక పరిపాలన అధ్యక్షుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 115వ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సామ్రాట్ కె.వి మధు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు భూదప్ప, రామాంజనేయులు, ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఐసిసిఐ బ్యాంకు ఆవరణలో గల విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు గొప్పపరిపాలనదక్షతకలవాడని, కేంద్రంలో అనేక పదవులు అనుభవించి, పదవులకే వన్నెతెచ్చిన మహానీయుడని, కార్మిక, వ్యవసాయ, రక్షణ రైల్వే,కమ్యూనికేషన్ఫు డ్ అండ్ అగ్రికల్చర్గా, ఉప ప్రధాన మంత్రి పదవులతో పాటు దేశ రక్షణ భారతదేశానికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్ అని తెలిపారు.
50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా 30 సంవత్సరాలు వివిధ కేంద్రం మంత్రి పదవులు అలంకరించి, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న గొప్ప నేత అని,
అణగారిన కులాల అభ్యున్నతి కోసంపాటుపడినమహనీయుడు అని కొనియాడారు
ఈ కార్యక్రమం బూదేప్ప అద్యక్షతన జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల రామాంజినే యులు, జిల్లా కో కన్వీనర్ బండారు కదిరప్ప, శ్రీరాములు, తాడిమర్రి రామాంజి నేయులు, యన్.నారాయణ, జీ. తిరుమలేశు, బి.గంగాధర్, డీ.సుధాకర్,యస్.నల్లప్ప,బాబయ్య, జీ.యన్.వి.ప్రసాద్ యన్.కామరాజు, మహిళా నాయకులు యస్.పద్మావతి, ఏ.నాగమ్మ, యన్. శ్యామల, యన్.అంజినమ్మ,యన్. యం. ధరిని తదితరులు పాల్గొన్నారు.