Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ పై అవగాహన

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవము కార్యక్రమంలో భాగంగా జిల్లా త్వరిత చికిత్స కేంద్రం నందు రాష్ట్రీయ బాల స్వస్థయ కార్యక్రమం లో భాగంగా మంగళవారం జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి డా “జి. నారాయణ స్వామి ఆధ్వర్యంలో సమావేశ మైన విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు మరియు తల్లిదడ్రులకు డౌన్ సిండ్రోమ్ వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించడ మైనది.
ఈ వ్యాధి పుట్టుకతో వచ్చే జన్యు సమస్య , ముఖ్యంగా 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళ గర్భo దాల్చిచో పుట్టే పిల్లలు ఇలాంటి లక్షణాలతో పుట్టే అవకాశం ఉంటుoదని అన్నారు. ఇది ఒక జన్యు సమస్య (ట్రైజోమి 21) అదనపు క్రోమోజోం కారణం అని తెలియజేశారు.
వీరికి రోగ నిరోధక శక్తి, కండరాల పటుత్వo, బుద్ధి కుశలత తక్కువని, ఎదుగుదల ఆలస్యం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు ఉంటాయని అని పేర్కొన్నారు. వీరికి ఈ కేంద్రం లో బిహేవియరల్ ,స్పీచ్, ఫీజియో థరఫీ, మరియు గుండె , కళ్లు , వినికిడి, థైరాయిడ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడును.
పుట్టుకతోనే లోపాలతో పుట్టిన పిల్లలను కాన్పు సమయంలోనే ప్రతి ఆసుపత్రి నందు స్క్రీనింగ్ చేసి నవజాత శిశువులకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నాము.
ఇలాంటి లోపాలతో పుట్టిన పిల్లలను సమాజంలో ఏటువంటి వివక్షకు గురికాకుండా కాపాడుకూవాలని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలలోని నైపుణ్యాన్ని గుర్తించి తగిన విధంగా ప్రోత్సహిస్తే మిగతా పిల్లల వలె రాణిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విద్య చిన్న పిల్ల వైద్య నిపుణులు, రజిత మనేజర్ -డి ఇ ఐ సి , మరియు సిబ్బంది డా “మల్లీశ్వరి, డా”ముత్యాలమ్మ , ఏజాస్ ఖాన్,సుందర్ రావు, చంద్ర కళ, ప్రసన్న, సుష్మ, దివ్య,సురక్షిత
పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img