Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వము యొక్క లక్ష్యమని, అందుకే గడప గడప అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం 8వ వార్డు కేశవ్ నగర్ లో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. వాడు ప్రజలు కూడా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత సిసి రోడ్లు 20 లక్షలతో నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. తదుపరి ఇళ్ల మధ్య ఉన్న కాలువలు, డ్రైనేజీలను పరిశీలించారు. మరోచోట కాలువలు శుభ్రం చేయకపోవడంతో సానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా అప్పటికప్పుడే కాలవలో గల చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించారు. కాలువలు డ్రైనేజీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా కు సూచించారు. తదుపరి అవార్డు ప్రజలు తమ వార్డునకు తగిన రోడ్లతో పాటు మరిన్ని కాలువలు నిర్మాణం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో దశలవారీగా అన్ని వార్డులలో కాలువ నిర్మాణము రోడ్ల ఏర్పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక మున్సిపల్ చైర్మన్ భాగ్యలక్ష్మి, 8వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య ఆచారి, ఇతర కౌన్సిలర్లు మాసపల్లి సాయికుమార్, కేతా లోకేష్, నీలూరి వెంకటరాముడు, వాడు ఇన్చార్జులు కత్తె పెద్దన్న, ఉడుముల రామచంద్ర, మున్సిపల్ డి ఈ వన్నూరప్ప, ఏఈ హరీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img