Friday, April 26, 2024
Friday, April 26, 2024

12 వేల మందికి ఉపాధి కల్పించే జాకీ దుస్తుల పరిశ్రమను లూఠీ పరిశ్రమ అనడానికి సిగ్గుండాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్.
అనంతపురం అర్బన్ : కరువు జిల్లాలో 12 వేల మంది నిరుద్యోగలకు ఉపాధి కల్పించే జాకీ దుస్తుల పరిశ్రమను లూఠీ పరిశ్రమ అనడానికి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కి సిగ్గుండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతోనే జాకీ దుస్తుల పరిశ్రమ వెనక్కు వెళ్లిందని, ఈ అంశంపై మాట్లాడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కించపరిచేలా మాట్లాడటం, ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆయన తనయుడు నారా లోకేష్ బాబు ను చంపుతామని బెదిరించడం తదితర అంశాలపై సీపీఐ జాఫర్ ఆపార్టీ నాయకులు,వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలసి మంగళవారం జిల్లా కేంద్రంలోని డిఐజి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ముందుగా అఖిల పక్ష నాయకులు ర్యాలీగా బయలుదేరి డిఐజి కార్యాలయానికి చేరుకున్నారు. డిఐజి లేకపోవడంతో కార్యాలయ అధికారికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ జాకీ దుస్తుల పరిశ్రమ లూఠీ పరిశ్రమ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పరిశ్రమను ఎలా అహ్వానిచాడో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వలేదని జాకీ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి పరిశ్రమ లేకుండా చేశారని తద్వారా జిల్లాలో మరే ఇతర పరిశ్రమలు రావడానికి భయపడేలా చేశారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరుడు చందు పై సుమోటో కేసు నమోదు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ సీఎం జగన్ కు లేఖ వ్రాశారని గుర్తు చేశారు. వైసిపి నాయకుల బెదిరింపులతోనే కియా పరిశ్రమకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు జిల్లాకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు తోపుదుర్తి చందు పై చర్యలు తీసుకోవాలని డిఐజి ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ.రాప్తాడు కన్వీనర్ కొండప్ప, నాయకులు నారాయణస్వామి,రమణ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు శంకర్, గోవింద్,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు,రామకృష్ణ, కేశవ రెడ్డి,రమణ, నగర సహాయ కార్యదర్శి అల్లిపిరా, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుల్లాయస్వామి, ఎ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆనంద్ కుమార్,సంతోష్ కుమార్, ఎ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఏపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి,నాయకులు నాగరాజు, శ్రీకాంత్, రమేష్, రవీంద్ర,జయలక్ష్మి,ఎల్లుట్ల నారాయణస్వామి,ధనుంజయ, బంగారు బాష, కృష్ణుడు ఆపార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img