యువగళం పాదయాత్ర పై ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే
విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణంలో శుక్రవారం స్థానిక శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ కార్యాలయము నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి గత ఐదు రోజులుగా నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పై శంకర్ నారాయణ ఎద్దేవ చేస్తూ ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. లోకేష్ ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రి పై మాట్లాడితే రాయలసీమ దాటే లోపల పరకలతో ప్రజలు కొడతారు. కియా వద్ద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోని రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైయస్సార్ పార్టీ పారిశ్రామిక అభివృద్ధికి ఎప్పుడూ అవరోధం కాదు, రిజర్వాయర్ వద్ద ఉన్న భూములను మాత్రమే వెనక్కి ఇప్పిస్తామని చెప్పారు రిజర్వాయర్ వల్ల ఎన్నో వేల ఎకరాల భూమి నీటిపారుదల ద్వారా స్థిరీకరణ ఏర్పడి భూములు మంచి పంటలు పండేవి వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే రైతుల భూములు రైతులకు ఇప్పిస్తామని లేదంటే నీటిపారుదల లేని ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తామని ఆయన తెలిపితే వీరు దానిని వక్రీకరించి వీడియో అనే కట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు ఆనాడు కియా పరిశ్రమకు భూములు సేకరించినప్పుడు రైతుకు పది లక్షల రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించగా ఆ భూములకు నష్టపరిహారము చాలదని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రైతుల సమావేశంలోని బాబు నాయక్ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం వలన రైతులకు న్యాయం చేస్తామని తెలుపగా వాటిని వక్రీకరిస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చురకలు అంటించారు.పెనుకొండ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం, చర్చకు ఎప్పుడైనా రండి. ఇప్పుడు జరుగుతోంది లోకేష్ యువగలం పాదయాత్ర కాదు, సెల్ఫీ యాత్ర. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా ప్రజలు అడిగిన ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చెప్పలేక వాటి మీద అవగాహన లేక పాదయాత్ర కొనసాగుతుందని ఆయన దుయ్యబట్టారు.ఈ సమావేశంలో పెనుకొండ మండల నాయకులు శ్రీరాములు వైశాలి జయశంకర్ రెడ్డి కొండలరాయుడు నాగులూర్ బాబు, రోద్దం ఎంపీపీ చంద్రశేఖర్ నారాయణరెడ్డి తాడేప్ప మరియు పట్టణ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.