Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విధులలో క్రమశిక్షణగా ఉండాలి… రాయలసీమ కమాండెంట్ మహేష్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : హోంగార్డులు విధులలో క్రమశిక్షణతో మెలిగినప్పుడే, మంచి గుర్తింపు లభిస్తుందని రాయలసీమ కమాండెంట్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ధర్మవరం సబ్ డివిజన్ లోని హోంగార్డులు పోలీస్ క్వార్టర్స్ పెరేడ్ గ్రౌండ్లో ధర్మవరం సబ్ డివిజన్ హోం కార్డ్ ఇంచార్జ్ ఆర్ఐ. శ్రీశైలం రెడ్డి, ఏఆర్ఎస్ఐ. శ్రీరాములు ఆధ్వర్యంలో వామ్ అప్ చేసి, స్క్వాడ్రిల్ నిర్వహించడం జరిగింది. స్క్వాడ్ డ్రిల్ ను మహేష్ కుమార్ పర్యవేక్షించడం జరిగింది. తదుపరి మహేష్ కుమార్ మాట్లాడుతూ హోంగార్డులు నిర్వర్తించే విధులలో బందోబస్తు, ట్రాఫిక్కు, నైట్ బీట్స్ మొదలు వాటి గురించి పూర్తిగా వివరించారు. అదేవిధంగా హోంగార్డుల యొక్క ఆరోగ్య పరిస్థితులను గూర్చి చర్చించి, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. విధులలో క్రమశిక్షణ చాలా కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. అలాగే హోంగార్డ్స్ ఈ కేవైసీ చేయించినప్పటి నుండి వారికి సంబంధించిన గ్రామ, పట్టణ వార్డు సచివాలయము నందు హోంగార్డుసును అని చూపించుచున్నదని, దీనివల్ల హోంగార్డ్స్ కుటుంబాలకు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని వారు అధికారుల దృష్టికి తెచ్చారు. మరొక్కసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి హోంగార్డ్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. హోంగార్డ్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిస్ కానందువలన రోజువారి వేతనాలు తీసుకోవడం జరుగుతోందని ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ కి హోంగార్డులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img