Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు అందించడమే నా ధ్యేయం… నూతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా దే యమనీ నూతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు గుంతకల్ మున్సిపాలిటీ నుండి ధర్మవరం నకు బదిలీ కావడం జరిగింది. అనంతరం ప్రస్తుత కమిషనర్ మల్లికార్జున తో పాటు అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఆనంద్, అకౌంటెంట్ శ్రీనివాసులు, డి ఈ వన్నూరప్ప,వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, నూతన కమిషనర్ కి స్వాగతం పలుకుతూ బొకేలు, పూల మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి కౌన్సిలర్లు రామకృష్ణ, గోరకాటి పురుషోత్తం రెడ్డి, కాంట్రాక్టర్లు కూడా నూతన కమిషనర్ కి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు అని తెలియజేశారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తోపాటు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు లను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బదిలీగా వెళ్ళనున్న మల్లికార్జున కార్యాలయములోని ముఖ్యమైన అధికారులను, సిబ్బందిని పరిచయం చేశారు. తదుపరి ధర్మవరం లోని వార్డుల సమస్యలు, వాటి ప్రగతి, తదితర విషయాలను మల్లికార్జున ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ తాను గుంతకల్ నుండి ధర్మవరం మనకు బదిలీగా రావడం సంతోషంగా ఉందని, ఇక్కడి ప్రజలు కూడా తనకు సహాయ సహకారాలు అందిస్తూ, ఆశీస్సులు అందజేస్తారని వారు తెలిపారు. ప్రభుత్వ అజెండా అనే మన అజెండాగా ప్రజలకు అన్ని సేవలు కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు సత్వరమే అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేటట్లు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది ద్వారా సహాయ సహకారాలను స్వీకరించి, ధర్మవరం పట్టణ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img