Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు పట్ల అభ్యంతరం

విశాలాంధ్ర – ఉరవకొండ :రాయలసీమ జిల్లాల్లో పట్టుబద్రులు, మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకి జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమలులోకి తీసుకొచ్చినప్పటికీ ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శుక్రవారం పాలకవర్గం సాధారణ సమావేశాన్ని నిర్వహించడం పట్ల మేజర్ గ్రామపంచాయతీ 11వ వార్డ్ సభ్యులు ఎం రామాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు అమలవుతున్న సమయంలో ఎన్నికల అధికారి ముందస్తు అనుమతితో సమావేశాలను నిర్వహించాలని ఎన్నికల అధికారి అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో జరిగిన తీర్మానాలు అన్నిటిని కూడా రద్దుచేస్తూ సమావేశాన్ని కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img