విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని తుమ్మల గ్రామంలో ఆర్మీ జవాన్ అయిన సమరసింహారెడ్డిని మంగళవారం అర్ధరాత్రి సమయంలో జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి తన అనుచరులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారాన్ని అందుకున్న టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అనంతపురం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచించారు. తదుపరి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ బాధితుని తండ్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడం నేరమా? నన్ను ఆ గ్రామానికి ఓ దైవ కార్యక్రమం పైన ఆహ్వానించేందుకు గాను గ్రామములో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి కారును తీయమని అడిగినందుకు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అరాచకాలు, ఆక్రమణలు, దాడులు ఎక్కువయ్యాయని. ప్రజలు గమనిస్తున్నారని, దౌర్జన్యం ఇకముందు సా గనివ్వమని వారు హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ఎల్లప్పుడూ తాము అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.