Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యార్థినీలకు నాణ్యమైన విద్య, భోజనాన్ని తప్పనిసరిగా అందించాలి

సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి

విశాలాంధ్ర – ధర్మవరం : విద్యార్థినీలకు నాణ్యమైన విద్యతోపాటు చక్కటి ఆహారాన్ని కూడా అందించాలని సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని మోటుమర్ల గ్రామంలో గల కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల, వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత విద్యార్థినీలకు గల వసతులపై ప్రిన్సిపాల్ చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉన్న వసతులపై ఆరా తీశారు. తదుపరి జడ్జి వంటగది, ఆహార సరుకుల నిల్వగది, బాత్రూము, విద్యార్థినీలు పడుకునే గదులు, హాస్టల్ చుట్టూ ఉన్న పరిసరాలు, విద్యార్థినీలకు అందుతున్న విద్యా వైద్య సదుపాయాలను నేరుగా తనిఖీ చేశారు. వంట గదిలో వంట చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారాన్ని తయారుచేసి విద్యార్థినిలకు అందజేయాలని వారు సూచించారు. ఇంటర్ కళాశాల కొరకు నిర్మాణం అవుతున్న భవన గదులను కూడా పరిశీలించారు.తదుపరి విద్యార్థినీలతో న్యాయ విజ్ఞాన సదస్సు వారు నిర్వహించారు. బాలల హక్కులు, విధులు గూర్చి వివరించారు. అనంతరం జడ్జి గీతావాణి మాట్లాడుతూ లైంగిక దాడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తమ వసతులు, భోజన విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నాకు తెలపాలని వారు సూచించారు. ప్రస్తుతం ఎండాకాలం ఉన్నందున తగిన ఆరోగ్యమును పరిరక్షించుకోవాలని సూచించారు. వివిధ చట్టాల గూర్చి తెలియజేస్తూ, బాలికలు సాధ్యమైనంత వరకు ఉన్నత చదువులు చదివి, భవిష్యత్తులో మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం న్యాయవాదిని బాల సుందరి మాట్లాడుతూ బాలల హక్కుల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం భవిష్యత్తులో ఉందని, ఆ హక్కులను కాపాడుకున్నప్పుడే సుఖవంతమైన జీవితం లభిస్తుందని తెలిపారు. విద్యా ,వైద్యం విషయంలో ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు కూడా తగు శ్రద్ధను కనపరచాలని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి చదివినప్పుడే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తారని తెలిపారు. బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరాదని తెలిపారు. దిశా యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాల వరకు గల మట్టి రోడ్డు ను తొలగించి తారురోడ్డు నిర్మాణం చేసేలా, తగు న్యాయం చేయాలని పలువురు విద్యార్థినిలు జడ్జిని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకళతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img