Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యను ఆర్జించుటలో విద్యార్థులు సమస్యలను ఎదుర్కోవాలి

విశాలాంధ్ర – ధర్మవరం : విద్యను ఆర్జించుటలో విద్యార్థులు సమస్యలను గట్టిగా ఎదుర్కొన్నప్పుడే జీవితములో మంచి భవిష్యత్తు లభిస్తుందని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, టూ టౌన్ సిఐ రాజా, రిటైర్డ్ ఎంఈఓ చిన్నపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు-రిజ్వాన్స్ విశ్వ భారతి హై స్కూల్లో శనివారం సాయంత్రం అన్యువల్ డే, చిల్డ్రన్ గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కమిషనర్ మల్లికార్జున, సిఐ రాజా, రిటైర్డ్ ఎంఈఓ చిన్నపరెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో సైన్స్ టెక్నాలజీ అతి ముఖ్యమైన దాని వారు తెలిపారు. సైన్స్ టెక్నాలజీ ద్వారా ఏ సమస్య అయినా విజయవంతంగా పరిష్కరించే అవకాశం ఉందని వారు తెలిపారు. కష్టపడి, ఇష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో ఒక ఉన్నత విద్యను చేరుకోవచ్చునన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా, ఉపాధ్యాయుల యొక్క చదువులోని మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉన్నప్పుడే చదువులో విజయాన్ని సాధిస్తారని తెలిపారు. పేదరికం చదువుకు అడ్డు రాదని, ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను కూడా ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంచి చదువుతోనే భవిష్యత్తుకు మంచి గుర్తింపు, మంచి ఉద్యోగం ఉంటుందన్నారు. చదువును భవిష్యత్తులో ఒక లక్ష్యంగా ఎన్నుకున్నప్పుడే అనుకున్న విజయం తప్పక వస్తుందన్నారు. ఈ విద్యార్థి దశలోనే మీరు ముందుగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యం కొరకు కష్టాన్ని సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ షేక్ శేకున్, వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img