Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రామీణ క్రీడలు సోదర భావాన్ని పెంపొందిస్తాయి

గ్రామీణ క్రీడలు వ్యక్తుల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని సీఎస్ఐ చర్చి సెక్రెటరీ ఏలియ, కోశాధికారి నీలాంభ్రం స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో జరిగే క్రీడలు వ్యక్తుల మధ్య మత సామరస్యంతోపాటు సోదర భావం పెంపొందుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్పూర్తితో మెలగాలని సూచించారు. గ్రామ పెద్దలు, యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ప్రథమ జట్టుకు రూ. 30,016, ద్వితీయ జట్టుకు రూ. 20,016 లతోపాటు షీల్డులను అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు దావీదు, ప్రభాకర్, హనుమంతు, విజయ్, మృత్యుంజయ, సంఘ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img