Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

ఖరీఫ్ సీజన్ కి విత్తనాలు సిద్ధం చేయాలి

పార్వతీపురం – మే 23 : వచ్చే ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఇబ్బంది లేకుండా డిమాండ్ మేరకు ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో సరిపడా విత్తనాల పంపిణీకి ముందస్తుగా జూన్ 3 వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వ్యవసాయ, అనుబంధ శాఖల మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఖరీఫ్ సీజన్ తొలకరి పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి రైతు భరోసా కేంద్రాల నుండి రైతుల డిమాండ్ మేరకు విత్తనాలను, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మొక్కజొన్న రైతులు పండించిన పంటకు జోను నెల మొదటి వారంలోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వైయస్సార్ యాత్ర సేవా పథకం క్రింద గ్రామస్థాయిలో రైతు గ్రూపులకు ఆధునిక యంత్రాలు, ఉపకరణాలు రాయితీపై అందించి రైతు ఆదాయ మార్గాలకు పెంపొందించేందుకు కృషి చేయాలి అన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్న షెడ్యూల్ కులాల రైతులను గుర్తించి రాయితీని వర్తింపజేయాలని ఎస్ సి కార్పొరేషన్ ఈ డి ని సూచించారు. జిల్లాలో పాడి పశువుల అభివృద్ధి, పాల ఉత్పత్తులు పెంచేందుకు అవరమైన పోషణకు , పశు గ్రాసలకు ప్రణాళిక సిద్ధం చేయాలని అందజేయాలని పశుసంవర్ధక శాఖ అధికారి ఆరిక ఈశ్వర రావును ఆదేశించారు. ఫిష్ ఆంధ్రా దుకాణాలకు రాయితీపై రుణాలు మంజూరుకు మిగిలిన లబ్ధిదారుల వివరాలు బ్యాంకర్లకు అందజేయాలని మత్స్య శాఖ అధికారుల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎమ్. సుధారాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆరిక ఈశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా ఉద్యానవన అధికారి కే.వి.ఎస్.ఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img