Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రారంభమైన శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి మహోత్సవ వేడుకలు

అధ్యక్షులు వెంకటేశులు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 27వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు నాలుగు రోజులు పాటు శ్రీ శాతకర్ణి చౌడేశ్వరి దేవి ప్రతిష్ట జరిగి 12 సంవత్సరాలు అయినా సందర్భంగా పుష్కరణోత్సవము, కుంభాభిషేకము కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు వెంకటేశులు( చిట్టి )గౌరవ అధ్యక్షులు గడ్డం పార్థసారథి,ఉపాధ్యక్షులు కాచర్ల నారాయణస్వామి, బంధనాదం ప్రకాష్, బండి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బందనాథం చిన్నికృష్ణ,సహాయ కార్యదర్శి బండి నాగరాజు, కోశాధికారి బంధనాదం వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకల్లో మొదటి రోజు సోమవారం సాయంత్రం గంగా పూజ గోపూజ గణపతి పూజ ను అర్చకులు యొక్క వేదమంత్రాలు మంగళ వాయిద్యాలయం అనుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగాలు జరిగాయి అని తెలిపారు. కుల గురువు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి వారి పర్యవేక్షణలో జరుగులాగున కుల బాంధవులు నిర్ణయించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం విశేషాలు ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నవగ్రహ జపములు గణపతి దుర్గ హోమాలు, సాయంత్రం లలిత సహస్ర కుంకుమార్చన, లలితా సహస్రనామ కుంకుమార్చన, మార్చి 1వ తేదీన ఉదయం మూలమంత్ర జపములు, అమ్మవారికి పంచామృతాభిషేకం, వివిధ హోమాలు, సాయంత్రం సుదర్శన మండల, ధన్వంతరి మూలమంత్ర హోమాలు, సాయంత్రం శ్రీ కోదండ రామాలయం భజన బృందం వారిచే అమ్మవారి భజన కార్యక్రమం, మార్చి రెండవ తేదీన అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, వివిధ హోమాలు, కలశ ఉద్వాసన అపూర్వక మహా కుంభాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పంచమ జ్యోతుల ఉత్సవముతో పాటు అమ్మవారి గ్రామోత్సవం కూడా నిర్వహించబడును అని తెలిపారు. ఇదే రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున కుల బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img