Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి

మండల సమావేశంలో అధికారులను నిలదీసిన సభ్యులు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ సభ్యులు మరియు సర్పంచులు అధికారులను నిలదీశారు. గురువారం ఉరవకొండ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం ప్రజలకు సక్రమంగా అందడం లేదని డోర్ డెలివరీ కోసం పెట్టిన వాహనాలు సక్రమంగా పనిచేయడం లేదని అనేకమంది లబ్ధిదారులకు నెలనెలా బియ్యం అందడం లేదని సభ్యులు పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న చక్కెర, కందిపప్పు, ప్యాకెట్లపై కొంతమంది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని సభ్యులు ప్రశ్నించారు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఉరవకొండ పట్టణంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకేజీలు అవుతున్నాయని వాటిని తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. విద్యుత్ సమస్యలు నెలకొన్న వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సమావేశాలకి కూడా రాని విద్యుత్ శాఖ ఏఈ పైన వైద్య శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కొంతమంది సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ షాబుద్దీన్ తెలిపారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు వీటితో పాటు అనేకమంది సభ్యులు అనేక సమస్యలను సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఏసి పార్వతమ్మ ఎంపీడీవో చంద్రమౌళి ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img