Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఓటు బ్యాంకు కోసమే ఎస్టి పునరుద్ధరణ అంశం

వాల్మీకి సీనియర్ నాయకులు బోయ రవిచంద్ర

విశాలాంధ్ర – ధర్మవరం : నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్టీ పునరుద్ధరణ అంశముపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం సరైన పద్ధతిలో లేదని, ఈ సిఫార్సు అంశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2017 లో క్యాబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని వాల్మీకి సీనియర్ నాయకుడు బోయ రవిచంద్ర, బొట్టు కృష్ణ, పూజ మొబైల్ సాయి, టైలర్ గోపాల్, లింగప్ప, జంగం నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ నేటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా ఉండటంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సమంజసమా? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా బిల్లులోనే అంశాలు కొన్ని సవరణ చేసి తిరిగి బిల్లు పంపమని ఆంధ్ర ప్రదేశ్కు కేంద్రం పంపిస్తే దానిని అశ్రద్ధ చేసి నేడు గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా ఏక సభ్య కమిటీ పేరిటన రాయలసీమలో నాలుగు జిల్లాలను మాత్రమే ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకోవడం ఏంటి అని వారు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఎనిమిది వాల్మీకులందరినీ కూడా ఎస్టీలోకి చేర్చి కేంద్రంలో ఆమోదింప చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సూరి, చౌడప్ప తోపాటు అధిక సంఖ్యలో వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img