Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

టీకాలు ఆరోగ్యానికి పెరుగుదలకు ఎంతగానో ఉపయోగం

డాక్టర్ తేజ కేతిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : టీకాలు అనేవి చిన్నపిల్లలకు ఆరోగ్యానికి పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పందన హాస్పిటల్ డాక్టర్ తేజ కేతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం జాతీయ టీకా దినోత్సవ సందర్భంగా పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల వరకు విధిగా టీకాలు వేయించితే ఆరోగ్య జీవితం లభిస్తుందన్నారు. టీకా విషయంలో తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతిఏటా 16వ తేదీన జాతీయ వాక్సినేషన్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. టీకాలకు భయపడే వారితోపాటు టీకాలను వ్యతిరేకించే వారిని కూడా టీకా పరిధిలోకి తీసుకొని రావడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వారు తెలిపారు. పలు ప్రమాదకర వ్యాధులను జీవితకాలం నిరోధించడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు, ఆరోగ్య నియంత్రణకు, ప్రాణాలు కాపాడటానికి టీకాలే దివ్య ఔషధమని వారు తెలిపారు. టీకాలతో ఆరోగ్య ,ఆర్థిక ,సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని తెలిపారు. వ్యాధులు సోకకుండా భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుంచి వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల నుంచి రక్షించడం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు శోకకుండా కట్టడి చేయగలమని వారు తెలిపారు. మన పిల్లలకు సకాలంలో అర్హత గల టీకాలను అందించాల్సిన కనీస కర్తవ్యం, తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు మీద ఎంతైనా ఉందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img