Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిఫారసు చేయడం హర్షనీయం

విశాలాంధ్ర – ఉరవకొండ : ఆంధ్రప్రదే శ్లో బోయలను మరియు వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చడానికి శామ్యూల్ ఆనంద్ ఏక సభ్య కమిషన్ ఆధారంగా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయడం పట్ల బోయలు మరియు వాల్మీకి కులస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం ఉరవకొండలో వాల్మీకి సంఘం నాయకులు ముండాస్ ఓబులేసు, హావలిగి ఓబులేసు, ముష్టూరు చంద్ర, మల్లికార్జున, సురేష్ మాట్లాడుతూ బోయలను వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తాము అనేక పోరాటాలను కూడా నిర్వహించడం జరిగిందని గత పార్లమెంటు సమావేశంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కూడా వాల్మీకుల యొక్క స్థితిగతులను మాట్లాడడం జరిగిందని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం న్యాయమైందని దీన్ని కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ కూడా ఆమోదించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి సిఫారసు చేయడం పట్ల వారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img