Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాలు

విశాలాంధ్ర -పెనుకొండ : నగర పంచాయతీలోని 5వ వార్డుకు సంబంధించి బోయపేట అర్బన్ కాలనీ ఎస్సీ కాలనీలలో బుధవారం వైయస్సార్సీపి పార్టీ ప్రతిష్టాత్మకంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.మా నమ్మకం నువ్వే జగన్ టౌన్ కన్వీనర్ నరసింహులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఐదో వార్డ్ సంబంధించిన పలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ జగనన్న సంక్షేమాల గురించి వివరిస్తూ స్టిక్కర్లు అంటిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ రాము, మరియు లక్ష్మీనారాయణ, కన్వీనర్లు మరియు వాలంటీర్లు గృహసారథులు వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img