Monday, May 6, 2024
Monday, May 6, 2024

అగ్ని ప్రమాదాలపై అవగాహన

విశాలాంధ్ర- ఉరవకొండ : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్లకు మరియు నర్సులకు సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కలిగించినట్లు ఉరవకొండ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ భీమ లింగయ్య తెలిపారు. హాస్పిటల్ యందు అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు అడ్మిషన్ లో ఉన్నటువంటి పేషెంట్లను అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటికి ఎలా తీసుకురావాలి అనేదానిపైన అక్కడి సిబ్బందికి డాక్టర్లకు సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్టులు వాడరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img