Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు జరగవు. అగ్నిమాపక అధికారి… యు. రాజు.

విశాలాంధ్ర -ధర్మవరం : అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు జరగవని అగ్నిమాపక అధికారి యు. రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు పట్టణంలోని గాంధీ నగర్ లో ఉన్న ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ అవుట్ లెట్ నందు పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యానికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు.అగ్ని ప్రమాదాల గూర్చి తెలిపారు. అనంతరం వాటి నివారణ పాయం లో భాగంగా కొన్ని ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అగ్ని ప్రమాదాలపై గల రకాలను గురించి తెలుపుతూ పెట్రోలు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి, డెమో ద్వారా చూపించడం జరిగిందన్నారు. తదుపరి అక్కడివారికి కరపత్రాలను బ్రోచర్స్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 20వ తేదీతో వారోత్సవాలు ముగిస్తాయని తెలిపారు.ముంబై ఓడరేవు నందు జరిగిన అగ్ని ప్రమాదమునందు దాదాపు 64 మంది అగ్నిమాపక సిబ్బంది తోపాటు వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందడం జరిగిందని దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులు శివరామిరెడ్డి, ముస్తఫా, హరినాథ్ రెడ్డి, రతచోదకులు- రవీంద్ర నాయక్, కృష్ణా నాయక్, కృష్ణమూర్తి, అగ్ని బటులు- ప్రకాష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు,మనోహర్, హరినాథ్ రెడ్డి, బాలకృష్ణ, వీరనారాయణ, హోంగార్డ్లు -, సతీష్ కుమార్, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img