Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి…

ఏపీ చేనేత కార్మిక సంఘం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర`ధర్మవరం : నేడు చేనేత కార్మికులు గిట్టుబాటు ధర రాకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం, మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆర్డిఓ తిప్పే నాయక్‌ వినతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణములో దాదాపుగా 15 వేల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారని గత మూడు సంవత్సరాలుగా మోడీ సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వలన ఆ కుటుంబాల పోషణ భారమై అప్పులు చేసి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో 30 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వము నుండి రావలసిన ఎక్స్ప్రెస్‌ ఇంతవరకు అందలేదని వారు తెలిపారు. ప్రభుత్వం అందించే ఒక లక్ష యాభై వేల రూపాయలు కాకుండా రైతులకు ఇచ్చే విధంగా ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చేనేత కార్మికుల కు కూడా అందే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంగం నాయకులు ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీధర్‌, సురేష్‌, నర్సిములు, వీర నారప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img