Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఫైరైన సవితమ్మ

విశాలాంధ్ర -పెనుకొండ : ఎమ్మెల్యే శంకర్నారాయణ వ్యాఖ్యలపై ఫైర్ అయిన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ ,చదువు కున్న అజ్ఞాని అని మరో సారి నిరూపించుకున్నావు నేను పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్స్ కూడా రాకుండా ఎక్కడ ఓడిపోతానో భయం చుట్టుకుని ఇలా వంకర మాటలు మాట్లాడుతూ కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతు పబ్బశీ
గడుపుతున్నావు ముందు నీ పార్టీలో నీకు టికెట్ ఉందో లేదో చూసుకో సొంత పార్టీ కార్యకర్తలతో నాయకులతోనూ చెప్పులతో కొట్టించుకున్న నీకు ఇంకా సిగ్గు రాలేదా.మీ పార్టీ పుట్టినప్పటినుండి ఎంతోమంది నియోజకవర్గంలో వైసిపి జెండా మోసిన నాయకులు ఉన్నారు , వాళ్లకు టికెట్ రాకుండా మీ పార్టీ కి డబ్బులు ఇచ్చి టికెట్టు కొనుకున్న ఘనత నీది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కురుబ ఉషశ్రీ చరణ్
కి జగన్మోహన్ రెడ్డి కురుబ ఉషశ్రీ కి నీ మంత్రి పదవి పీకేసి ఆమెకు మంత్రి పదవి ఇచ్చాను అని మీ ముఖ్యమంత్రి అంటున్నారు మరి రెడ్డి కులస్తుడి ని పెళ్లి చేసుకోలేదా మరి దీన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు.అదేవిధంగా సింగనమల నియోజకవర్గం లో ఆలూరు సాంబ శివారెడ్డి భార్య జొన్నలగడ్డ పద్మావతి ఈమె ఎస్సీ భర్త రెడ్డి కులానికి చెందినవారు మరి దీన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు. మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదా శంకర్ నారాయణ.
నీకు మంత్రి పదవి పోయేసరికి చిన్న మెదడు చిట్లి ఏమి మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు.ముందు నీ పార్టీలో నువ్వు కడుక్కో మా పార్టీ టికెట్ల విషయం గురించి నీకెందుకు
నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్న ఇక్కడే రాజకీయం కూడా చేస్తా నీలాగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయలేదు
ఇక కాచుకో 2024 నిన్ను ఈ నియోజకవర్గము ప్రజలే తరిమి కొడతారు.
2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం నీ అక్రమాలు,నీ బినామీ ఆస్తుల చిట్టి విప్పి ప్రజలు ముందర పెడతాం. అంటూ ఎమ్మెల్యే శంకర్ నారాయణకి ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img