Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని పోతులని గెలిపించాలని సీపీఐ ప్రచారం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి బ్యాలెట్ 03 నెంబర్ కు మొదటి ప్రాధ్యాన్యత తో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు బ్యాలెట్ 27 నెంబర్ కు మొదటి ప్రాధ్యాన్యత తో ఓటు వేసి గెలిపించాలని శనివారం పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఏఐఎస్ ఎఫ్ నాయకులు మొదటిగా పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ రామసుబ్బయ్య తన సిబ్బందితో ప్రచారం చేశారు.అనంతరం పట్టణంలో ప్రచారం చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్.గోపీనాథ్ ,మండల కార్యదర్శి రాము రాయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి బ్యాలెట్ 03 నెంబర్ కు మొదటి ప్రాధ్యాన్యత తో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు బ్యాలెట్ 27 నెంబర్ కు మొదటి ప్రాధ్యాన్యత తో ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో ఏఐవైఎఫ్ మాజీ నాయకులు మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ నియోజవర్గ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్, సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్,శ్రీనివాసులు ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు శిక్షావలి, శివమణి, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img