Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

గర్భిణీలు ఐరన్‌ టాబ్లెట్లను తప్పనిసరిగా ఉపయోగించుకునేలా చూడాలి

విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారి నివాస్‌ శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు ప్రోగ్రాం అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కిశోర బాలి కలు, గర్భిణులు ఐరన్‌ టాబ్లెట్లను తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిస్థాయిలో నివారించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 20 ఏళ్ల లోపు గర్భిణులను గుర్తించి వారి ఆరోగ్యంపై పూర్తి సమాచారం సేకరించి పొందుపర్చాలన్నారు. వారికి వైద్యం అందించడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలని కోరారు. రక్తహీనతను నివారించేందుకు యుక్త వయస్సు నుంచే బాలికలకు ఐరన్‌ టాబ్లెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైరిస్క్‌ కాన్పులను గుర్తించి ఎప్పటికప్పుడు జాబితా సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి యుగంధర్‌ , ప్రోగ్రాం అధికారులు నారాయణస్వామి, సుజాత, డెమో భారతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img