Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

హౌసింగ్‌ ఏఈ దేవరకొండ రామమూర్తి
విశాలాంధ్ర-రాప్తాడు :
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో సొంత ఇల్లులేనివారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించామని హౌసింగ్‌ ఏఈ దేవరకొండ రామమూర్తి తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి అన్ని కాలనీల్లో కనీస మౌలిక వసతులైన విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను హౌసింగ్‌ డేలో ప్రతి శనివారం జగనన్న కాలనీల పర్యటనలో భాగంగా మరూరు, ఎం.బండమీదపల్లి, గాండ్లపర్తి గ్రామాల్లో శనివారం ఎంపీడీఓ సాల్మన్‌, విద్యుత్‌ ఏఈ రమాదేవి, సర్పంచులు ప్రభావతి, ఉమాదేవి, పంచాయతీ కార్యదర్శులు వరలక్ష్మి, అరుణ్‌ కుమార్‌, విజయ్‌ లతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో నూతన గృహ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఏఈ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఆవశ్యకతను, గృహనిర్మాణ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు, తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ మూడు గ్రామాల్లో 336 ఇళ్లు మంజూరయ్యాయని, ఆ లే అవుట్‌లను తనిఖీ బృందాలు సందర్శించి ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నామన్నారు.కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు కళ్యాణ్‌, ఫిరోజ్‌, తనోజ్‌, వర్క్‌ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img