Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

‘జలజీవన్‌ మిషన్‌’తో తాగునీటికి శాశ్వత పరిష్కారం

విశాలాంధ్ర`ఉరవకొండ : జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు రూ.10.90 కోట్లతో చేపట్టిన పనులకు గురువారం స్థానిక కనేకల్‌ క్రాస్‌ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జలజీవన్‌ పథకంతో నియోజకవర్గంలో ఉన్న ప్రతీ ఇంటికి ఉచితంగా తాగునీటి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నాడు పాదయాత్ర సమయంలో మహిళలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గుర్తించారని అందుకే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు.ఈ పనుల ద్వారా ఉరవకొండ పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు.ఈపథకం కింద రెండు విడతలలో దాదాపు రూ,10.90కోట్లు, మంజూరు చేయడం జరిగిందన్నారు ఇందులో ఉరవకొండ పట్టణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రూ. 3.15 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే ఉరవకొండ రూరల్‌ కి రూ.2.06 కోట్లు, కూడేరు మండలానికి రూ. 56 లక్షలు, బెలుగుప్ప మండలానికి రూ.2.08 కోట్లు, విడపనకల్లు మండలానికి రూ.2.78 కోట్లు, వజ్రకరూరు మండలానికి 2.37 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన వెల్లడిరచారు.దీనితో పాటు ఉరవకొండ పట్టణానికి పీఏబీఆర్‌ నుండి అదనపు పైప్‌ లైన్‌ నిర్మాణం కొరకు 10 కోట్ల రూపాయలు మంజూరుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అంగీకారం తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓబులేసు, సర్పంచ్‌ లలిత, ఉప సర్పంచ్‌ వన్నప్ప, ఎంపీపీ చంద్రమ్మ, వైస్‌ ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, ఎర్ర స్వామి, బసవరాజు,వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, వైస్సార్సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img