Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దోమల నివారణతోనే ఆరోగ్య పరిరక్షణ.

విశాలాంధ్ర-తాడపత్రి: పెద్దపప్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, సచివాలయాలలో మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని, అవగాహన సదస్సు, ర్యాలీలు నిర్వహించామని డాక్టర్ ఏ .కళ్యాణ కుమార్, డాక్టర్ ఎస్. ఉషారాణి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమలు ఉత్పత్తి కాకుండా నివారించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా పరిరక్షించబడతారన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువాపు, విష జ్వరాలు తదితర వ్యాధులు వ్యాపిస్తాయి. కావున తమ పరిసరాల చుట్టూ పరిశుభ్రతగా ఉంచుకోని దోమలు ఉత్పత్తి కాకుండా దోమల కుట్టకుండా చూసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు కమ్యూనిటీ హెల్త్ అధికారి భారతి హెల్త్ సూపర్వైజర్స్ చిన్న కంబయ్య, లక్ష్మీ కుమారి, నాగరత్నాలు హెల్త్ అసిస్టెంట్ సుధాకర్ , శరత్ ల్యాబ్ టెక్నీషియన్ శివరాజ్ హెల్త్ ప్రొవైడర్స్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img