Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు…

ఇన్సాఫ్ కమిటీ ఇన్చార్జ్ ఎస్ఎండి గౌస్ (సీపీఐ)

విశాలాంధ్ర-గుంతకల్లు : రంజాన్ సందర్భంగా నెలరోజులపాటు ముస్లింలు కటోర ఉపవాస దీక్షలో పాటించడం గొప్ప వరంగా భావిస్తారని మత సామ్రాస్యానికి ప్రత్యేక గా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఇన్సఫ్ కమిటీ ఇన్చార్జ్ ఎస్ఎండి గౌస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ ఎం డి గౌస్ మాట్లాడుతూ…ప్రజల మధ్య మత సామ్రస్యానికి ప్రత్యేకగా సోదర స్నేహ బాంధవ్య భావాన్ని పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు రంజాన్ పండుగ ముస్లింల ప్రాధాన్యతకే కాకుండా సమస్త ప్రజానీకం ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికంగా ఎదుగుదలతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెదజల్లాలని రంజాన్ పండుగ సందర్భంగా భగవంతుని వేడుకుంటూ ప్రార్థనల రూపంలో వేడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తదుపరి పండుగలో భాగంగా జరుపుకొను బాసికుబ్దా రోజున ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సంయుక్తంగా వివిధ ప్రాంతాల దర్గాలకు వెళ్లి అక్కడ విశిష్టంగా ప్రార్థనలతో సేవలు చేపట్టడం ఆనవాయితీ అన్నారు. సదరు ఆనవాయితీలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలకు చోటు ఇవ్వకుండా ప్రయాణ భద్రత నియమాలను పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు సదరు దర్గాలకు విచ్చేయుచున్న భక్తాదులకు, ప్రజలకు వారి రక్షణకు గాను పోలీసు అధికారులు భద్రతలను కట్టుదిడ్డము చేస్తూ విధులను నిర్వహించాలని పోలిస్ శాక కు, సంబంధిశీచిన ఉన్నతాధికారులు చర్యలను చేపట్టాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని ముస్లిం కమిటీ సభ్యులు రోజా ఉన్న వారందరికీ తెల్లవారు జామున తైరి ఇంతజాం ఏర్పాటు చేసినందుకు వారందరికి ఇన్సఫ్ కమిటీ ఇన్చార్జ్ ఎస్ఎండి గౌస్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు ఉమ్మర్ భాష ,బాబా ఫక్రుద్దీన్ ,షబ్బీర్ ,దౌలా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img