Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పాఠశాల విద్యార్థినీలు చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు..

వన్ టౌన్ ఏఎస్ఐ..పుట్టప్ప
విశాలాంధ్ర- ధర్మవరం: పాఠశాల విద్యార్థినీలు చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని, అలా జరిగితే చదువుకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని వన్ టౌన్ ఏఎస్ఐ పుట్టప్ప, పాఠశాల హెచ్ఎం ఉమాపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణములోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు విద్యార్థినిలకు, చట్టం పైన, దిశా యాప్ పైన అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం ఏఎస్ఐ పుట్టప్ప, హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచే చదువుపై ఒక లక్ష్యమును ఎంపిక చేసుకోవాలని, తద్వారా క్రమశిక్షణతో కూడిన చదువును అభ్యసించినప్పుడు, అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు మంచి జీవితమును గడిపే అవకాశం ఉందన్నారు. దిశా యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవలసిన అవసరం నేటి సమాజంలో ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. దిశ యాప్ బాలికలకు రక్షణగా ఉపయోగపడుతుందన్నారు. కొత్త వ్యక్తులతో, ఆకతాయితులతో స్నేహం చేయడం వలన కలిగే నష్టాలను వారు వివరించారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు పెద్దలపట్ల గౌరవం ఇచ్చే విధంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మాటను నిలబెట్టి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలను వారి నమ్మకాలను ఒమ్ము చేయరాదని శ్రద్ధతో చదువుకున్నప్పుడే వారికి ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసులు మౌనిక, హేమలత, పాఠశాల ఉపాధ్యాయులు, 600 మంది బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img