Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం.. రోటరీ క్లబ్ ప్రతినిధులు

విశాలాంధ్ర- ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యము అని రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కోశాధికారి జయసింహ, సీనియర్ ప్రతినిధులు సోలిగాళ్ళ వెంకటేశులు, సత్రశాల ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో గురువారం ఈ నెల 8వ తేదీన నిర్వహించబడు, ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉచిత కంటి శిబిరము రోటరీ క్లబ్ శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు, అనంతపురం జిల్లా అందత్వ నివారణ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం వీరి భర్త కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగ తేజ, కోడలు శర్వాణి, మనవడు కలవల మిహాను,సుకన్య సిల్క్స్- ధర్మవరం, క్యాంపు చైర్మన్గా కె నరేందర్ రెడ్డి, రవాణా సౌకర్య దాతలుగా కీర్తిశేషులు కే. ఉలిక్కి రెడ్డి కుమారుడు కె. రామచంద్రారెడ్డి అండ్ మిత్రబృందం వారు వ్యవహరిస్తారని తెలిపారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులకు అందరికీ కంటి సంబంధ సమస్య నిపుణులచే పరీక్షలు కూడా చేయించడం జరుగుతుందన్నారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని, కంటి వైద్య చికిత్సలతో పాటు బెంగళూరులో కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించి, కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి,బండారు చలం, సత్రశాల కిరణ్ కుమార్, శివయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img