Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై పోరాటం

విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం : ప్రభుత్వ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై వసతి నిద్ర పేరుతో పోరాటం చేస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు హనుమంతు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే వేలాది మందితో కలెక్టర్‌ కార్యాలయం ఇస్తామని వారు హెచ్చరించారు. వీటితోపాటు ఈనెల 3నుంచి 10 వరకు వసతి నిద్ర కార్యక్రమానికి శ్రీకరం చుట్టమని గత సంవత్సరం పెండిరగ్‌ లో ఉన్న 1400 కోట్లను తక్షణం విడుదల చేయాలని కడప ఉక్కు పరిశ్రమ కోసం సిపిఐ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్మికుల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని వసతి గృహాలు వసతి గృహాలు శీతాలవాస్తుకు చేరాయని నిత్యవసర వస్తువులకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల లో బీసీ ఎస్సీ వెల్ఫేర్‌ డిడి కార్యాలయంలో దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడమే కాకుండా కార్యక్రమానికి వెనకాడబోమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ తాలూకా అధ్యక్షులు ప్రకాష్‌ ఉపాధ్యక్షులు మహమ్మద్‌ సాయికుమార్‌ సహాయ కార్యదర్శి బాలాజీ నవీన్‌ నాని జయంత్‌ శివమూర్తి జాకీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img