Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సకాలంలో పోషకాహారం తీసుకోవాలి గర్భవతులకు రక్త పరీక్షలు.


విశాలాంధ్ర : గర్భవతులు రక్త పరీక్ష పోషకాహార విలువ గల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భవతులకు పరీక్షలు నిర్వహణ కార్యక్రమం పై గురువారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి అకస్మాతనికి నిర్వహించారు అనంతరం వారు గర్భవతులకు ఆరోగ్య సూచనలు సలహాలు ఇచ్చారు. గర్భవతులు సకాలంలో పోషకాహారం తీసుకోవాలని వారు సూచించారు.గర్భవతిగా ఉన్నప్పుడు రెట్టింపు మోతాదులో ఆహారం తీసుకోవడం వలన తల్లీ బిడ్డల పోషకావసరాలు తీరి ఆరోగ్యవంతులుగా వుంటారు.తల్లిలో పౌష్టికాహర లోపం వుంటే పిల్లలు మరణించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవాలని వారు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. వైద్య, అంగన్వాడి సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు చైల్డ్ మ్యారేజ్ విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ తరుణ్ సాయి, శోభ లత, సూపర్వైజర్స్ సుమతి, వరలక్ష్మి, స్టాఫ్ నర్స్ భవాని, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు ,గర్భవతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img