Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సజావుగా సాగిన కౌన్సిల్ సమావేశం

పట్టణ సమస్యలపై కౌన్సిలర్ల వినతులు
… మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం సజావుగా జరిగాయని మున్సిపల్ చైర్మన్ లింగ నిర్మల, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. తొలుత అజెండాలోని 76 అంశాలపై, మరో మూడు ప్రత్యేక అజెండాలపై కౌన్సిలర్లతో చర్చించి తీర్మానం చేశారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు పలు సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకొని రాగా, వాటిని అతి త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. మునిసిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్లు కేత లోకేష్, గజ్జల శివ, తదితరులు మాట్లాడుతూ పండుగలు వచ్చినప్పుడు పట్టణంలో నీటి పంపిణీ సరిగా లేదని ప్రజల ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అనంతరం కమిషనర్ స్పందిస్తూ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎటువంటి లోపాలు లేకుండా ప్రజలకు నీటిని అందిస్తామని, పార్నపల్లి నీటి పంపింగ్ కేంద్రంలో విద్యుత్ కోత ఉన్నందున ఈ సమస్య ఏర్పడిందని వారు తెలిపారు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని వారు తెలియజేశారు. అదేవిధంగా స్మశాన వాటికలో చెత్తాచెదారంతో పాటు, అపరిశుభ్రమైన నీరు చేరుతోందని వాటిని వెంటనే తొలగింప చేసి శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు తెలియజేశారు. అదేవిధంగా చిన్న జెసిబిలు మరమ్మత్తులు ఉన్నందున, వాటిని కూడా త్వరగా మరమ్మతులు చేయించి, పట్టణ పరిశుభ్రతకు ఉపయోగించడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ వాహనాలు అధికమైన సౌండ్తో వార్డులలో తిరుగుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్లులలో ఫిల్టర్ంగు సరిగా జరగడంలేదని వెలువెంటనే ఆర్వో ప్లాంట్ యాజమాన్యంతో సమావేశపరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడవాలని తెలిపారు. అంతేకాకుండా ఆరో ప్లాంట్ వారు ప్రజలకు అందించే ఫిల్టర్ వాటర్ ను అధిక రేట్లతో కూడా విక్రయిస్తున్నాడం దానిని కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. అనంతరం కమిషనర్ స్పందిస్తూ వెంటనే ఫిల్టర్ వాటర్ నాణ్యమైన గా ఉండేటట్లు చర్యలు చేపట్టి ప్రజలకు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతి పండుగకు ప్రజలకు నీరు సకాలంలో అందించే విధంగా ఇంజనీరింగ్ విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. నూతనంగా పట్టణములో నిర్మించిన స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ తోపాటు బోర్డ్ కూడా పెట్టించాలని కౌన్సిలర్లు తెలిపారు. పట్టణములోని ఆర్వో ప్లాంట్ యజమానులు అందరూ కూడా ఒకే ధరతో మినరల్ వాటర్ను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని చైర్మన్ లింగం నిర్మల మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. మొత్తం మీద పట్టణంలోని పలు సమస్యలతో పాటు అజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిలర్లు అందరూ కూడా తమ ఆమోదంతో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజురు నాగరాజు (సాయిరాం), మున్సిపల్ అధికారి శ్యామ్ రాజ్, ఇంజనీరింగ్ విభాగం డి ఇ వన్నూరప్ప, ఏఈలు ప్రతాప్, హరీష్, రోహిణి, సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, టీపిఓ రెహమాన్, వార్డు కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img