Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించారు. పటమటలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు.సీఐడీ అరెస్ట్‌ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే.. ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు అశోక్‌బాబు తెలిపారు. విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని అశోక్‌బాబును గత అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 18 గంటలపాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. అశోక్‌ బాబుకు విజయవాడ కోర్టు నిన్న రాత్రి బెయిల్‌ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img