Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఏపీలో కొత్తగా 1,843 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 70,727 నమూనాలు పరీక్షించగా 1,843 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. తాజా ఫలితాలతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1948592కు చేరింది. మరో 12 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13209కు పెరిగింది. కొత్తగా 2,199 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,11,812కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,39,09,363 నమూనాలు పరీక్ష చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23571 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో కొత్తగా ప్రకాశం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img