Monday, March 27, 2023
Monday, March 27, 2023

త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తాం

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
వైసీపీ ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాతీయ గీతాన్ని ఆలపించిన మదనపల్లె పట్టణంలో జాతీయ గీతాన్ని స్మరించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా పోలీసు బలగాలతో వైసీపీ ప్రభుత్వం అణచి వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి దేశభక్తి అన్నా, స్వాతంత్రం విలువలు అన్న గౌరవం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.జనగణమన గీతాన్ని మదనపల్లిలో ఫిబ్రవరి 28న బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు నివాళులర్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తామని అన్నారు. జాతీయ గీతానికి వైసీపీ ప్రభుత్వం అవమానించే రీతిలో ప్రవర్తించిందని, దీన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img