Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. పది దుకాణాలు ఆహుతి

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అర్ధరాత్రి చెలరేగిన మంటలు
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
బాధితులకు పరిహారం ఇస్తామన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఫ్లై ఓవర్‌ కిందనున్న ఓ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి క్రమంగా పక్కనున్న షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img