Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలి

పవన్‌పై సజ్జల విమర్శలు
పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ పోరాటాలు చేయడం మానుకుంటే మంచిదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పవన్‌ కల్యాణ్‌ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదు. పవన్‌ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాలి.’’అని అన్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ షో కోసమే అని దుయ్యబట్టారు. కెమెరా ఆన్‌ చేసి యాక్షన్‌ అనగానే నటించి వెళ్లడానికి ఇదేమీ సినిమా కాదని వ్యాఖ్యానినంచారు.గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.పబ్లిసిటీ కోసం చిల్లర కార్యక్రమాలు చేయడం పవన్‌ కళ్యాణ్‌ మానుకోవాలన్నారు. ‘పవన్‌ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుంది. బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన నష్టం ఏమి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత’ అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img