Monday, March 20, 2023
Monday, March 20, 2023

బాలిక ఆత్మహత్య.. వినోద్‌ జైన్‌ను బహిరంగంగా ఉరితీయాలి : విజయసాయిరెడ్డి

విజయవాడకు చెందిన 14 సంవత్సరాల బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్‌ జైన్‌ ను ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్‌ చేసింది. మరోపక్క టీడీపీ నేతలపై వైస్సార్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో, బాలిక ఆత్మహత్య ఘటనపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.చంద్రబాబు ఆజ్ఞతో స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదన్నారు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు వినోద్‌ జైన్‌ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img