Monday, April 22, 2024
Monday, April 22, 2024

ముగిసిన దుర్గ గుడి పాలకమండలి సమావేశం

దుర్గ గుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఇవాళ సమావేశంలో పలు అంశాలపై పాలకమండలి చర్చించింది. సుమారు 66 అజెండాలపై పాలకమండలి చర్చించింది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నామని పాలకమండలి చెబుతోంది.రానున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు పాలకమండలి వెల్లడిరచింది. ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్‌ రైస్‌ ప్రసాదంగా పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రతి భక్తుడికీ కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ పంపిణీ చేయాలని, దసరాకు సంబంధించి ఏర్పాట్లపై సిద్ధంగా ఉన్నామని పాలకమండలి తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img