Friday, May 31, 2024
Friday, May 31, 2024

సీఎం సానుకూలంగా స్పందిస్తారు..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఉద్యోగ సంఘాల నేతలు
దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం సంతోషం కలిగించిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛనుపై స్పష్టంగా చెప్పాం. నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో కొన్ని అంశాలను ప్రకటించి అధికారులతో చర్చించాలని పేర్కొన్నారు. ఇవాళ సీఎంఓ అధికారులను కలిసి హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఉద్యోగులకు తప్పకుండా న్యాయం చేయాలని కోరాం. హెచ్‌ఆర్‌ఏకు సంబంధించి కిందిస్థాయి ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని చెప్పాం’ అని అన్నారు. హెచ్‌ఆర్‌ఏపై సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. ఊహించని విధంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నారు. తమ విజ్ఞప్తులను సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తారని, ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img