Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమరావతి రైతులపై మరోసారి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు..

అమరావతి రైతులపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గుడివాడలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని అమరావతి ప్రాంత రైతులపై గుడివాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలోని 17వ వార్డులో బుధవారం కొడాలి నాని ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని పేర్కొన్నారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, ఆ ప్రాంతంలోని పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి (అమరావతి) అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. అయితే, అమరావతి రైతులు మాత్రం తామే బాగుండాలని విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తామని కొడాలి నాని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img