Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆధునిక భాష ఆద్యుడు మహాకవి గురజాడ

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
విశాలాంధ్ర – యస్‌. రాయవరం : ఆధునిక భాష ఆద్యుడు మహాకవి గురజాడ వేంకట అప్పారావు అని పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మంగళవారం గురజాడ జన్మస్థలం విశాఖపట్నం జిల్లా యస్‌. రాయవరం లో గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన రచనలో ముఖ్యంగా కన్యాశుల్కం నాటకం ద్వారా బాల్యవివాహాలు వలన కలిగే నష్టాలను నాటకం ద్వారా ప్రదర్శనలు జరిగాయని తెలిపారు. గురజాడ జన్మస్థలం తన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉండటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జయంతి ని సామాజిక దినోత్సవం గా నిర్వహించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్నని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకర దేవి, వైసీపీ జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు, మండల వైసీపీ కన్వీనర్‌ కొణతాల శ్రీనివాసరావు, సర్పంచ్‌ భూపతి అప్పారావు, గురజాడ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కర్రి వేంకటేశ్వరరావు, వైసీపీ సీనియర్‌ నాయకులు పొలిశెట్టి పెద ఈశ్వరరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, నూకినాయుడు, అల్లాడ నాగరాజు, లక్కొజు ఆదిమూర్తి, రామచంద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img