Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడుతుండగా.. మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీగా వానలు పడతాయంటున్నారు. అలాగే యానాంతో పాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. అలాగే ఎల్లో అలెర్ట్‌ ఇచ్చారు.. బుధవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయంటున్నారు ఏపీ వెదర్‌ మ్యాన్‌. మంగళవారం నెల్లూరు,తిరుపతి లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని.. అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ,పశ్చిమగోదావరి, కృష్ణ,బాపట్ల,ప్రకాశం,వైస్సార్‌, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img