Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్‌, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వెల్లడిరచింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర , రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, రేపు కూడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img