Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ఏపీ సేవ 2.0’ ప్రారంభించిన సీఎం జగన్‌

పాలనలో మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సిటిజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవ పోర్టల్‌’ని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ ఏపీ సేవ పేరును ఈ పోర్టల్‌కు పెడుతున్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీ తనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగుపరచే గొప్ప కార్యక్రమం ఇది. ఏపీ సేవా పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగు. గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది..’అన అన్నారు. ‘540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారు. గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 4 లక్షలమంది సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేవలను మరింత మెరుగు పరుస్తూ ముందడుగు వేస్తూ 2.0ను ప్రారంభిస్తున్నామ’ని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img