Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలి : సీఎం జగన్‌

ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలని, రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలన్నారు.దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని అన్నారు. ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లను ప్లేస్‌చేయగానే వాటిని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాల కొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img